Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹280

అతిథి దేవోభవ...

ఆదోని బాష - 9440239828

“డాడీ అతిథి దేవో భవ అంటే ఏమిటి?" సాయంత్రం ఇంటికి రాగానే రాంబాబుకి అతని ఆరేళ్ళకొడుకు చంటి వేసిన ప్రశ్న ఇది. అతిథి పేరు వింటేనే మండిపడే రాంబాబుకి కొడుకు ప్రశ్న విని చిర్రెత్తుకొచ్చింది.

“వెధవా.... ఆ మాత్రం తెలీదా? అతిథి దేవో భవ అంటే అతిథి దెయ్యంలా భయపెడతాడని అర్థం” కసిగా చెప్పి విసురుగా సోఫాలో కూర్చున్నాడు. ఆ

అతని వేగానికి సోఫా కుయ్యో మొర్రో అంటూ టకటకమని చప్పుడు చేసింది. వంటింట్లో ఉన్న లత భర్త మాటలు విని హాల్లోకొచ్చింది.

“అదేంటండీ, ఎవరి మీది కోపమో వాడి మీద చూపిస్తున్నారు. ఆఫీసులో బాసుతో గొడవపడి వచ్చారా?" అనడిగింది.

"గొడవపడింది బాసుతో కాదు, బాసుగారి బాసుతో" “బాసుగారి బాసా, అదెవరు?" “ఇంకెవరు, మన బాసుగారి భార్యామణి" “ఆవిడ మీ ఆఫీసుకెందుకొచ్చింది? “బుద్ధి గడ్డి తిని మేమే పిలిచాం" “ఎందుకు?"

మా కంపెనీ చాక్లెట్ల సేల్స్ పెంచటానికి మేం అప్పుడప్పుడు కస్టమర్లతో చిన్న చిన్న మీటింగులు ఏర్పాటు చేస్తుంటామని మీకు తెలుసు కదా. ఈ రోజు అలాంటిదే ఓ మీటింగ్ జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా బాసుగారి భార్యని ఆహ్వానించాం. ఈ రకంగా సుని ప్రసన్నం చేసుకోవాలనుకున్నాం,

ఆయన భార్య బిస్కెట్ కంపెనీకి సేల్స్ అడ్వయిజర్‌గా వ్యవహరిస్తోంది. ఏవో నాలుగు ఉచిత సలహాలిచ్చి మా బ్రాంచిని ప్రోత్సహిస్తుందనుకుంటే ఆవిడ మా స్టాప్ ని లక్స్ సబ్బుతో కడిగేసింది. నన్నయితే ఓబిస్కెట్ లా కరకర నమిలి తినేసింది"

“ఇంతకీ ఆవిడ ఏం చెప్పింది?" “చాలా చెప్పింది.

హిమాలయాల్లో ఐస్ క్రీముని అమ్మాలంది. థార్ ఎడారిలో ఇసుక వ్యాపారం చెయ్యాలని చెప్పింది. బంగాళాఖాతంలో ఉప్పుని అమ్మాలని సెలవిచ్చింది. ఇవన్నీ చెయ్యగలిగినవాడే నిజమైన స్స్మే న్ అని శ్రీకృష్ణుడిలా గీతోపదేశం చేసింది”.........