బాలలన్న, బాలలకు విద్యా బోధనన్నా, బాల సాహిత్యమన్నా విశేషాసక్తి గల వ్యక్తి డా|| నన్నపనేని మంగాదేవి. పిల్లలలో ఉన్నతమైన విలువలను, ఉత్తమ అభిరుచులను పెంపొందించడానికి సాహిత్యం చక్కని సాధనం అని నమ్మే ఈమె బాలల కోసం దాదాపు రెండు డజన్నర పుస్తకాలు, అనేక వ్యాసాలు, కవితలు,కథలు వెలువరించారు.
1965 గుంటూరులో మంగాదేవి స్థాపించి నిర్వాహిస్తున్న "శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్" నేడు శాఖోపశాఖలుగా విస్తరించి ఉత్తమ విద్యాసంస్థగా అందరి మన్ననలను అందుకుంటోంది.
పూర్వ ప్రాధమిక విద్యలో పరిశోధన, విద్యారంగంలో మూడున్నర దశాబ్దాలు అనుభవం, దేశ విదేశాల్లోని విద్యాసంస్థల పరిశీలన నుండి గ్రహించిన విశేషాంశాల మేళవింపుతో, మంగాదేవి విద్యాబోధనలో అనేక విన్నూత విధానాలను రూపొందించారు.
బాల సాహిత్యంలో విశేష కృషి సలిపిన వారిని ప్రోత్సహించడం కోసం డా|| మంగాదేవి ఒక వార్షిక పురస్కారాన్ని ఏర్పరచి ఒక ప్రముఖ బాల సాహితీవేత్తకు ప్రతి సంవత్సరం అందజేస్తున్నారు