కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమదేవి 30 సంత్సరాలకు పైగా పరిపాలించింది.ఒక గొప్ప సామ్రాజ్యాన్ని అత్యంత ప్రతిభావంతంగా పరిపాలించిన ప్రధమ మహిళా చక్రవర్తి రుద్రమదేవి చరిత్రలో సుస్థిరమైన స్థానం లభించింది. ఆమె జీవితాన్ని వస్తువుగా తీసుకోని ఇదివరకు చాలా సాహిత్యం... ముఖ్యంగా నవలలు వెలువడ్డాయి . వాటిల్లో నోరి నరసింహశాస్త్రి రచించిన "రుద్రమదేవి " అన్న చారిత్రక నవల ప్రఖ్యాతి పొందింది . అలాగే అడవి బాపిరాజు రచించిన "గోన గన్నారెడ్డి" అన్న నవల్లో కూడా రుద్రమదేవి ఒక ప్రధాన పాత్రగా ఉంటుంది. అలాగే ఇటీవలనే ప్రాణ్ రావు అనే నవలాకారుడు "రుద్రమదేవి " పేరుతో ఒక నవలను రచించాడు. ఇదే వరసలో "తక్కెళ్ళ బాలరాజు" "రాణి రుద్రమదేవి - జన్మ వృత్తాంతమ్" పేరుతో ఈ నవలను రచించాడు.