Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
డాక్టర్ కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లిలో 1946 మార్చి 10న పుట్టారు. తిరుపతిలో పి.యు.సి., పాండిచ్చేరిలో ఎం.బి.బి.ఎస్. చేశాక నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి విక్టోరియా మెమోరియల్ ఆసుపత్రిలో స్కిన్ స్పెషలిస్ట్ గా కుష్టు రోగులకు సేవలందించారు. కుష్టువ్యాధిపై వీరు రాసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ, అంతర్జాతీయ మెడికల్ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. పీడితజన పక్షపాతంతో, దళితుల సమస్యలపట్ల సానుతాపంతో రాయలసీమ గ్రామీణ జీవిత సంఘర్షణే ఇతివృత్తంగా రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. 'నిసలు-భగవానువాచ', 'ఇన్ క్రెడిబుల్ గాడెస్', 'స్మశానందున్నేరు', 'అతడు అడవినిజయించాడు', 'మునెమ్మ', 'మూగవాని పిల్లనగ్రోవి', 'చివరిగుడిసె', 'సిటీ బ్యూటిఫుల్' వీరి ఇతర రచనలు. 'అతడు అడవిని జయించాడు' నవలను నేషనల్ బుక్ ట్రస్ట్ వారు 14 భారతీయ భాషల్లోకి అనువదించారు. 'ఇన్ క్రెడిబుల్ గాడెస్' నవల మరాఠిలోకి అనువాదమైంది. డాక్టర్ కేశవరెడ్డి 2015 ఫిబ్రవరి 13వ తేదీన పరమపదించారు.