Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

రామాయణంలో రమణీయ ఫుట్టాలు ఆపాత మధురం రామాయణం

రామాయణ, భారత, భాగవతాలు భారతీయులందరికి పరమ ప్రామాణిక మైన గ్రంథములు. అందునా రామాయణం మానవాళికి కలిగెడి సమస్త సంశయాలను తీర్చి, పవిత్ర ధర్మమార్గాన్ని సూచించే దివ్యమైన కావ్యం. వేదాలు, ఉపనిషత్తుల పరమార్థాన్ని సామాన్య మానవులకు కావ్య రూపంలో అందించిన మధురమైన కృతి రామాయణం.

సాహితీ క్షేత్రములో అవతరించిన కృతులలో రామాయణం' ఆదికావ్యం. దీనిని లోకములో ఆవిష్కరింపచేసి, పాఠకులకు మాధుర్యాన్ని పంచి పెట్టిన మహర్షి వాల్మీకి 'ఆదికవి'. సీతారాముల ఇతివృత్తాన్ని ప్రధానంగా చేసికొని, పాఠకాళికి రసానందము, సదుపదేశాలను అందించిన మహాకావ్యము వాల్మీకి రామాయణము.” శ్రీరామచంద్రప్రభువు యొక్క అవతార లీలా విశేషాలను తెలియజేయు మహేతిహాసము రామాయణము'. సీతారాముల చరిత్ర భారతదేశమందలి వివిధ

భాషలలో పద్య, గద్య, కావ్య నాటకాది పెక్కు సాహిత్య ప్రక్రియలలో 'అవతరించటమే కాదు-ప్రపంచమందలి వివిధ భాషలలోనికి రామాయణం 'అనువదింపబడింది. రామాయణములోని ప్రతి ఘట్టము ఒక రసగుళిక-ప్రతి ఘట్టము ఆపాత మధురము. శ్రీమద్రామాయణంలో ఎన్నో విలక్షణమైన, విశిష్టమైన సన్నివేశాలు, ఘట్టాలు ఉన్నాయి. వానిలో కొన్ని రమణీయమైన ఘట్టాలను సరళ సుందర భాషలో చిత్రించటానికి ఈ గ్రంథములో ప్రయత్నించాను. రసజ్ఞులైన తెలుగు సాహితీప్రియులు నా యీ గ్రంథాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

ఈ గ్రంథమందలి ప్రతి వాక్యాన్ని చదివి, దొసగులను సవరించుటయే గాక, రమణీయమైన పీఠికను సమకూర్చిన మా అన్నయ్య గారు డాక్టర్ జంధ్యాల మహతీ శంకర్ గారికి, మా వదినె గారు శ్రీమతి సుభాషిణి గారికి నమస్సులు...........