Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
రమణ మహర్షి - సజీవ గురువు ఆత్మ జ్ఞానాన్ని సూటిగాను మరియు సుళువైన మార్గంలో బోధించడంలో రమణ మహర్షి అగ్రగణ్యులు. శ్రీ రమణ మహర్షి బోధనలు ఒక కాలానికి మాత్రమే వర్తించి, పరిమితి చెందినవి కాక కాలకాలాలకు అవి ఆమోదమైనవిగాను, సజీవమై నిలచియుండేవిగాను, జీవితాన్ని సరియైన మార్గంలో పరమార్థంవైపు నడిపించే బోధనలని చాటి చెప్పాయి. 1907వ సంవత్సరంలోనే మహర్షి శ్రీ గణపతిముని వారిని జగద్గురువుగా పోషించారు.
రమణుని బోధలలోని మాధుర్యాన్ని అనుభవించి నేటికీ అవసరమొచ్చినప్పుడల్లా రమణుల మార్గదర్శకత్వాన్ని, సహాయాన్ని అంచెలంచెలుగా పొందుతున్న ఎందరో అన్వేష్యకుల స్వంత అనుభవాలు ఎన్నో ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకంలో కూర్చిన ఎన్నో విషయాలు రమణుని బోధనలలోని అర్థాన్ని వివిధ కోణాల్లో దర్శింపజేసి, స్పష్టంగా తెలియచెప్పడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వాటి సహాయంతో సత్ఫలితాలను పొందవచ్చు.
రమణుని బోధనలవైపు ఆకర్షితులౌతున్న వారి సంఖ్య క్రమక్రమేణా విశ్వమంతటా దినదిన ప్రవర్థమానంగా పెరుగుతూ ఉండడం, వారి గ్రంథాలు, బోధనలు వివిధ భాషల్లోకి అనువదించబడి వాటికి అత్యంత ప్రాచుర్యం లభించడం రమణులు నేటికీ సజీవ గురువులని రుజువు చేయడానికి చక్కటి నిదర్శనాలు.