Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
హృదయోల్లాసము
మనకుని కాళిదాసు నరు చెప్పగానే భరతఖండమే కాదు, ప్రపంచమంతా పులకరిస్తుంది. న్యాసవాల్మీకుల తరువాత మహాకవులలో కాళిదాసుని పేరే లెక్కలోకి నచ్చింది. ఆ మహాకని సుధాకరుని వాక్సుదాధారలే అందుకు ప్రబల కారణం. నాగర్థాలను సార్వతీపరమేశ్వరులుగా భావించటమే కాక, సమప్రాధాన్యంతో ప్రయోగించి రససిద్ధిని సాధించిన కవితారసవైద్యుఁడు కాళిదాసుఁడు. వేద పురాణాలను చదువలేనివారు ఈ మహాకవీశ్వరుని కావ్యసముచ్చయాన్ని శ్రద్ధగా చదిని అనేక ధర్మరహస్యాలను గ్రహించి ఆచరిస్తే మహానుభావులుగా విలసిల్లం గలుగుతారు.
కాళిదాసు ఎప్పటివాడు?
'ఇటువంటి ఈ మహాకని తన జన్మకాల నివాసప్రదేశాదులను గుఱించి సుస్పష్టంగా ఎక్కడా చెప్పలేదు. కావ్యాంతర్గత విషయాలను బట్టి, యితనిని స్తుతించినయితరకవుల కాలాదులనుబట్టి యీ కవీశుని కాలాన్ని నిర్ణయించటానికి పరిశోధకులు ప్రబల ప్రయత్నాలు చేశారు. అయితే ఈ కాలవిషయం క్రీ.పూ. 8వ శతాబ్దినుంచి క్రీ.శ. 11వ శతాబ్దినలకు వచ్చింది. ఇందుకు వివిధదశలలో కనిపిస్తున్న కాళిదాస ప్రస్తావనలే కాక వివిధ కాలాలలో బయలుదేటిన అభినవ కాళిదాసాదులు కూడా కారకులే. ముఖ్యంగా భోజకాళిదాసకథలు కాళిదాసును 11వ శతాబ్దివఱుకు తెచ్చాయి. నిజానికి భోజరాజుకు కాళిదాసుకు చారిత్రక సంబంధం లేనే లేదు. ఒకవేళ ఉంటే ఆ కాళిదాసు ఈ కాళిదాసు కాదు. ఆ కథలు కేవలం విద్యార్థులకు సాహితీప్రీతిని పెంచటం కోసం వ్రాయఁబడ్డ చమత్కృతికృతులు.
క్రీ.పూ. నాలుగైదు వందల సంవత్సరాల క్రిందట ఉన్న భాసకవీంద్రుని కాళిదాసు స్మరించాఁడు గనుక అతనికి ఇతఁడు తరువాతి నాఁడవుతాడు. క్రీ.శ. 7వ శతాబ్దిలో ఉన్న బాణభట్టు కాళిదాసును స్తుతించాడు గనుక ఇతనికి అతఁడు ముందటి వాఁడవుతాడు. ఇటువంటి మఠ కొన్ని ఉపపత్తులను క్రోడీకరించిన............