Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

అయ్యా/అమ్మ!

పాతికేళ్ళ కిందట నా వయస్సు ముప్పయ్ ఏళ్ళు. నా ముప్పయ్యో ఏటా - మీకు - తెలిసిన సంగతే : నేను మద్రాసులో వున్నాను.

ఆసలు - అది కాదు సంగతి!

"సర్వజ్ఞ నామ ధేయము

శర్వునకే , రావుసింగ నరపాలునికే

యుర్విo జెల్లును, తక్కోరు

సర్వజ్ఞoడనుట , కుక్క సామాజ మనుటే !"

ఎవరు చదివారో గుర్తు లేదు గానీ, ఆ పద్యం చదివి, వో అక్షరాన్ని అటు ఇటు మర్చి, మళ్ళి చదివి , అందులోని చమత్కారాన్ని చెప్పుకుంటూ పోయారాయన.

శాస్త్రిగారు - అదే - రామకృష్ణశాస్త్రి గారు - గట్టిగా సిగిరెట్టు లాగి, సవాదుగా పొగ వదులుతూ సాభిప్రాయంగా నా వేపు చూశారు. ఆ చూపుకు అర్ధమేమిటంటే - "నాయనా! అలాంటి పజ్జాలు ని కేమన్నా వచ్చునా? వస్తేగిస్తే చదవరాదా? అని.