నోట మాట రానంతగా ఆశ్చర్యపోయింది అపర్ణ.
"నేను ఆయనకి లవ్ లెటర్ రాసానా? అది నువ్వు చేశావా? ఎప్పుడు చూసావ్? ఎలా చూసావ్?" ఆశ్చర్యం నుంచి తేరుకొని అడిగింది."
"అలా అడుగు చెప్తాను. అవేళ మా నాన్నవాళ్ళు చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు మీ ఇంటికి వచ్చి ని రూమ్ లో పడుకోలేదు నేను? అవేళ చూశాను. నవల చదువుకుంటూ ఉంటె అందులో కనిపించింది ని ఉత్తరం. నేను చదివాను . "ప్రియమైన చెందు " అంటూ మొదలెట్టి భలేగా రాశావు. నువ్వు చెప్పకపోయినా నేను గ్రహించేసాను. "చెందు" అంటే ఎవరా అని ఆలోచించేసరికి తెలిసిపోయింది. వెంటనే చంద్రశేఖరం గారికి చెప్పేశాను. " అంటూ తను చేసిన ఘనకార్యం బయట పెట్టేశాడు.
అంతా శ్రద్దగా విన్న అపర్ణకి ముందు ఏమి అర్ధంకాలేదు. అర్ధమైన మరుక్షణం తలబాదుకుంది. "గొప్పపని చేశావు! మంచి ఇంటలిజెంట్ వి కాదు! ఇలాగె చెయ్యాలి మరి! కర్మ! అందులోని చెందు ఈయన కాదు.