Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మన అవయవాల గోడు విందాం:
మేము మీ అవయవాలం. మీకు అన్నీ మేమే. మీరు మేము వేరు కా అలాంటి మమ్ములను మీరు ఎలా చూస్తున్నారు? ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు ఎంత శ్రద్ధ వహిస్తున్నారు? ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించం గుర్తుతెచ్చుకోండి!
మీకు అందాన్ని, రూపాన్ని ఇచ్చే మీ జుట్టు రాలిపోతుంటే, మీ తల బోడిదైపోతుంటే ఏం చేస్తున్నారు? కారణాలు ఆలోచిస్తున్నారా? మీ బూటు పరిరక్షించుకోవటానికి ఏదైనా కార్యాచరణ చేపడుతున్నారా? మీకు లోకాని చూపించే కళ్ళు దూరదృష్టి, హస్వదృష్టి లాంటి ఎన్నో రోగాల బారిన పడుతుంటే ఏమి చేయలేరా? వందల వేల సంవత్సరాలు ఉండవలసిన మీ పండ్లు మీ జీవితకాలంలోనే మీ నోట్లోనే పుచ్చి పోతుంటే తినటానికి కూడా తంటాలు పడుతూ ఎలా సర్ది పెట్టుకుంటున్నారు? మన పూర్వీకులు ఆయుధాలుగా ఉపయోగించిన, ప్రకృతి సహజంగా అతి బలిష్టమైన ఎముకలు మన బరువే మోయలేక వంగిపోతూ, టపా టపా విరిగిపోతుంటే అసహాయంగా ఎలా ఉండి పోతున్నారు?
ఇలాంటి పరిస్థితే మీ మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఉదరకోశము, కాలేయము, కాళ్లు చేతులు, మర్మాంగాలు, నరాలు, చర్మం లాంటి ఎన్నో అవయవాలది. ఒక్కొక్క అవయవానికి తూట్లు పడుతుంటే రకరకాల బాధలు పంటి బిగువన భరాయిస్తూ, మందులు పై ఆదారపడుతూ జీవచ్చవాల్లా బతుకు ఈడుస్తున్నాం. ఏమి చేయాలో అర్థంకాక బేలగా దేవుడి పై భారం వేసి చివరలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నాం.
ఎంతో చదివి, ఎన్నో నేర్చుకొని, ఏవేవో సాధించి, ఎన్నింటిలోనో పై పైకి దూసుకు పోతూ మన దేహాన్ని మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? మన అవయవాలను ఎందుకు పరిరక్షించుకోలేకపోతున్నాం? సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్న మనం మన అవయవాల దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇంత అసహాయం.............