Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కుటుంబం, సమాజం స్త్రీ పట్ల ఇంత నిర్దయగా ఎందుకు వున్నాయో! ఇలా కూర్చో.... అలా కూర్చో, అలా నవ్వొద్దు.. అంతగా ఏడవద్దు, పరిగెట్టద్దు... నలుగురిలో తలెత్తద్దు, సంసారంలో గుట్టుగా వుండు... అన్నీ.. స్త్రీలే ఎందుకు చెయ్యాలి. స్త్రీ ఎప్పుడూ ఎందుకు అధమస్థానంలో వుండాలి. సమాజానికి ఇబ్బంది లేకుండా తనకు నచ్చినట్లు తనుండటం అనేది స్త్రీకి ఎందుకు సాధ్యం కాదు. మగవాడి అధికారాన్ని అసలెందుకు భరించాలి. అసలు ప్రపంచంలోనే ఎవరికీ ఇంకొకళ్ళ మీద అధికారం వుండకూడదు. ప్రేమతో మాత్రమే మనుషుల్ని గెల్చుకోవాలి. ప్రేమకు దాసోహం అనే మనుషులు వుండొచ్చు కానీ అధికారానికి బానిసలు వుండకూడదు. దానికి దాస్యం చేయకూడదు. స్త్రీ పురుషుల శారీరక ధర్మాలు మాత్రమే వేరు. అంతేకానీ వారు మిగతా దేంట్లోనూ ఒకళ్ళతో ఒకళ్ళు తీసిపోరు. ఇద్దరూ సమాన స్థాయిలో పుండాలి. స్థాయీ భేదాలుండ కూడదు. ఎంతమాత్రం ఉండకూడదు.