నిత్య జీవితంలో ఎదురయ్యే 40 ప్రశ్నలకు ఈ గ్రంథముద్వారా పరిష్కారము కనుగొనవచ్చును. ఇందుకు పది గడులున్న చక్రమును ఏర్పాటు చేసుకోవాలి. చక్రం పై దానిమ్మ లేదా గంధం పుల్ల (ఇది 9 అంగుళముల పొడవు వుండాలి) పుల్లతో మూడుసార్లు సవ్యదిశలో, మూడుసార్లు అపసవ్య దిశలో - ఇష్టదైవాన్ని స్మరిస్తూ తిప్పి, చక్రం పై ఒక చోట ఆ పుల్లను నిలపాలి. పుల్ల నిలిపిన గడివద్ద సంఖ్యను గుర్తించాలి. ఇప్పుడు అడిగిన ప్రశ్న తాలూకు చక్రంతో సరిపోల్చి చూసుకోవాలి. ఉదాహరణకు పుల్ల నిలిచిన సంఖ్య 6 అనుకుందాం. ఇప్పుడు వృశ్చకుడు అడిగిన ప్రశ్న నేను ఇతనితో స్నేహం చేయవచ్చా? అనుకుందాం. ఇందుకు చక్రముతో సరిచూసుకోవాలి. చక్రంలో 6 సంఖ్య సహదేవ నామం సూచిస్తుంది. ఫలితంకోసం ఫలితాల పట్టికలో సహదేవ పట్టికలో 6 సంఖ్యను చూడాలి. సమాధానం నువ్వ ఇతనితో స్నేహం చెయ్యవద్దు. మంచి జరుగుతుంది అన్న సమాధానం వుంటుంది. స్నేహం చెయ్యకుండా వుంటే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏయే ప్రశ్నలకు ఈ గ్రంథం ద్వారా పరిష్కారం పొందవచ్చో తెలుసుకుందాం.
- శ్రీ చింతా గోపిశర్మ సిద్ధాంతి