Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹100

ఈ ప్రయత్నం ఎందుకంటే

'తెలుగులో ప్రాచీన సాహిత్యం అంటే నన్నయతో ప్రారంభమైన సాహిత్యం దగ్గర నుండి ఆధునిక యుగం పూర్తి స్వరూప స్వభావాలతో ఆవిష్కృతమైన 1857లోపల వచ్చిన సాహిత్యం . ఈ కాలంలో జీవించిన

స్త్రీల సాహిత్యం గురించిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ఇప్పుడెందుకు? పితృస్వామ్యానికి, భావజాల రంగంలో మద్దతు సంపాదించి పెట్టే

సాధనంగా సాహిత్యం పాత్ర అర్ధం అవుతున్న కొద్దీ రచయితలుగా పీలు దానిలో ఎట్లా భాగం అయ్యారు, ఎట్లా పెనుగులాడారు. అన్న ప్రశ్నలు ఆలోచించవలసినవే అవుతాయి. ఆ ఆలోచనలో భాగంగా వ్రాసినవి ఇవి.

స్త్రీవాద రాజకీయాల చర్చకు స్త్రీల సాహిత్యం ఎలా ఉపయోగ పడుతుందో పుస్తకాలు, ప్రత్యేకించి తెలుగు పుస్తకాలు చదవని, చదవలేని యువతకు తెలియచేయటం అవసరమని అందుకు వ్యాసాలు వ్రాయటం కాక వీడియోలు తీసి యూట్యూబ్ లో పెట్టమని యువతరం 'ఒక వైపు నుండి కోరుతున్న సమయంలోనే వంగపల్లి పద్మ వాయిస్ ఆఫ్ ది పీపుల్ (ప్రజలగొంతుక) ఛానల్ ద్వారా స్త్రీల సాహిత్యం గురించి మాట్లాడమని అడిగింది. అనుకొంటున్నది ఆచరణకు తేవటానికి 'అవకాశం కదా అని ఆనందంగా ఒప్పేసుకొన్నాం ..............