వేదాలు, పురాణాలు, జానపద సాహిత్యం, జనసాహిత్యం అన్ని మానవ జీవిన పరిణామ క్రమంలో భాగాలు. దేని ధ్యేయం దానిది. దేని పరిధి దానిది. దేన్నీ అశ్రద్ధ చేయడానికి వీలులేదు. కాని, మారుతున్న కాలానికి అవసరమయ్యేది నిలుపుకుంటూ, అవసరం లేనివి పురావస్తు భాండాగారంలో భద్రపరుచుకోవడం మేలు. బాల సాహిత్యం, బాల రంగస్థలం లాంటి అన్ని బాలల కార్యక్రమాలు అశ్రద్ధకు గురైపోతున్న తరుణంలో, సినీ, టి.వి. కార్యక్రమాలతో వారి లేలేత మేదడ్లను కలుషితం చేస్తున్న తరుణంలో బాధ్యత గల పౌరులంతా ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఇది! బాలల వయసుకు వారి ఊహలకు తగినట్టుగా సృజనాత్మక విషయాలను అందించాల్సి వుంది. దేవుళ్ళు, దెయ్యాలు, లేని కొత్త కథల్నీ రాయాల్సి వుంది.
-దేవరాజు మహారాజు.