గ్రీకు తత్వశాస్త్ర స్వర్ణయుగం బిసి నాల్గవ శతాబ్దం. బానిస సమాజం అత్యున్నత స్థాయికి చేరి, సంఘర్షణలు, సంక్షోభాలకు గురవుతున్న కాలమది.ఓ వైపున బానిస యజమానులు అపారమైన సంపదను కూడా బెట్టుకున్నారు. మరోవైపున బానిసలు, ఇతర చేతివృత్తులవారు తీవ్రపేదరికంలో కూరుకుపోయారు. ఈ ఇరువర్గాల మధ్య తీవ్ర సంఘర్షణ జరుగుతున్న రోజులవి. ఆ కాలంలోనే తత్వశాస్త్రం, సంస్కృతి, కళలు వికసించాయి. డెమోక్రిటస్ భౌతిక వాదానికి ప్రాతినిధ్యం వహించాడు. పరమాణు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు.
ప్లాటోభావవాద తత్వవేత్త, జ్ఞానాన్ని విజ్ఞన శాస్త్రం, భావన అని రెండుగా విభజించడం అయన ప్రధాన సిద్ధాంతం, కేవలం విజ్ఞాన శాస్త్రానికే పరిమితమయితే సత్యాన్ని సంపూర్ణంగా కనుగొనడం అసాధ్యం అని ప్లాటో చెప్పాడు.
-ఏ.ఎస్.బోగోమలోన్.