Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలు సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐదవ తరగతిలోపు బాలల కొరకు తెలుగు భాషలో సాహిత్యం చాలా తక్కువగా వుంది. ఆ కొరతను తీర్చడానికే ఈ ప్రయత్నం.
పిల్లలకోసం ఇప్పటికే 60కి పైగా పుస్తకాలు రచించిన హరికిషన్ ది పసందైన శైలి. ఆకట్టుకునే కథనం. ఈ కథలు చదువుతుంటే మన అమ్మమ్మనో, తాతయ్యనో పక్కన కూర్చుని కథ చెబుతున్నంత కమ్మగా వుంటుంది. పిల్లలు మాట్లాడుకునే భాషలో అత్యంత సరళంగా కథలు రాయడం వీరి ప్రత్యేకత.