పెంపకాన్ని, బోధనని ఒక విద్యా క్రమంలో మిళితం చెయ్యాలని అభ్యుదయ బోధకులు చాల కాలంగా ప్రత్నించారు. ఆ కల సుహోమ్లిన్ స్కి బోధనా కృషిలో నిజమైంది. ప్రతి పిల్లవాడిలోనూ ప్రత్యేక వ్యక్తిని దర్శించడం అనేది అయన బోధనా పద్దతిలోని నిగ్గు, పిల్లల్ని పెంచి విద్యా బుద్దులు నేర్పాలని ఆశించే ప్రతివాళ్లకి యిది అవసరమైన గుణం. పిల్లల్ని తెలివైన వాళ్లు, మందకొడిగా వుండేవాళ్ళు అనే విభజన యేమి చేయక్కర్లేకుండానే మాములుగా ఆరోగ్యంగా ఉండే పిల్లవాడికేవాడికేనా గని యూనాటి సెకండరీ విద్య బోధించవచ్చని సుహోమ్లిన్ స్కి సిద్ధాంత రీత్యా, ఆచరణ రీత్యా రుజువుచేశాడు.
-వి.సుహోమ్లిన్ స్కి.