ఈశ్వరస్యచారితామృతం. చంద్రశేఖర గుణను కీర్తనం నీలకంఠ తవ పాదసేవనం - సంభవంతు మామ జన్మ జన్మని.
శివపురాణము -కార్తీకపురాణము శివభక్త విజయము వంటి సద్గ్రంధములను చదవడం భక్తవశంకరుడుగు - చాంద్రశేఖరుని భక్త వాత్సల్యమును కొనియాడడము - నీలకంఠుని పాదసేవ భాగ్యమును జాన్మ జన్మలకు ప్రసాదించుమని మనం ప్రార్ధన సేయుటకు ఆదిశంకరుల వారి శ్లోకమును అందించినాడు . మోక్షామును గురించి ప్రాత్యేకముగ నిచట పేర్కొనబడలేదు. కారణమేమంటే "కోటి జన్మల యందలి పుణ్యమును మూట గట్టుకొనిన వారలకు శివుని యందు భక్తి కలుగునని పంచమావేదమైన మహాభారతమునందు శివ సహస్రనామ స్తోత్రపీఠిక యందున్నది. కావున శివభక్తి పరాయణులు మోక్షసౌధము నధిరోహించు మెట్లా పై కాలు పెట్టిన వారలని భోధపడుచున్నది.