Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
సెప్టెంబరు 2018లో నేను పొలండ్ దర్శించినపుడు నాకు ఆతిథ్యమిచ్చిన వారు- ఇజబెలా జుట్ కా (Izabela Zubko), రఫాల్ జార్నిక్ (Rafal Jarnicki) దంపతులు. వార్సాలోని చక్కని అపార్ట్మెంటులో నాకోసం ఓ గదిని ప్రత్యేకించి నాకేలోటూ లేకుండా స్వంత సోదరుడిలా చూసుకున్నారు. 'ఇజబెలా'తో కలిసి నేను పోలండ్ కవితోత వాలలో ముఖ్య అతిధిగా పాల్గొనడం, ఎంతోమంది కవుల కవయిత్రుల స్నేహాన్ని పొందడం నా జీవిత ప్రయాణంలో మధురమైన ఘట్టం.
ఇంతకుముందు 'ఇజబెలా జుబ్ కో' రచన- "అంతరించిన దీపాల ప్రపంచం” వెలువరించాను. పవిత్ర త్రిమూర్తి రూపం (The Holy Trinity) ఆమె రచనలలో విశిష్టమైన రచన. చిన్నిచిన్ని వాక్యాలలో అనంతమైన భావనను ఇమిడ్చి ఆమె తన కవిత్వాన్ని రసమయంగా తీర్చిదిద్దుతుంది. Father, Son and Holy Ghost - తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ - అనే త్రిమూర్తి తత్వపుభావన ఈ కవిత్వానికి ప్రేరణ. కవిత్వానికి దీటైన చిత్రాలు ఈ పుస్తకానికి చక్కని సొగసునిచ్చాయి.
ప్రపంచ సాహిత్యంలో లబ్దప్రతిష్ఠులైన కవుల రచనలను తెలుగులోకి అనువదించి సాహితీప్రియులకు కానుకగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వెలువడుతున్న ఈ పుస్తకాన్ని అందరూ ఆదరిస్తారని విశ్వసిస్తూ.......
- డాక్టర్ లంకా శివరామప్రసాద్