Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
జీవితంలో చాలామందికి ఆకర్షింపబడతాం. వాళ్ళకోసం సమయం వెచ్చిస్తాం. వాళ్ళ సాహచర్యంలో సంతోషాన్ని వెదుక్కుంటాం. అదే ప్రేమ అనుకుంటాం. కానీ ఏది ప్రేమ? ఏది కాదు? అనే అనుమానం మనల్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. కానీ, ఎవరికోసమైతే ఓడిపోవడాన్ని కూడా విజయం అనుకుంటామో, ఎవరు చేసిన గాయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ తలుచుకుని, తడుముకుని నవ్వుకుంటామో; ఎవరిని పొందడం కోసం మన కలల్ని, లక్ష్యాలని, నేను అనే అస్థిత్వాన్ని సైతం కోల్పోయి సున్నా అయిపోతామో, ఎవరి కోసం అయితే ఈ ప్రపంచం ముందు అవమానింపబడడానికి, వెలివేయబడడానికి, నగ్నంగా నిలబడడానికి కూడా సిగ్గుపడమో, ఎవరికోసమైతే ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుకాడమో... ఆ వ్యక్తే నీ నిజమైన ప్రేమికురాలు, ప్రేమికుడు. ఆ అనుభూతే నిజమైన ప్రేమ. అటువంటి అనుభవం ఒక్క క్షణమే అయినా కూడా, అదే నిజం, ఆ క్షణమే శాశ్వతం!