Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఒక పుస్తకాన్ని సమీక్షించటం ద్వారా, ఆ పుస్తకంలోని అంశంపట్ల, ఆసక్తిని, అనురక్తిని, అవగాహనని కలిగించటంలో సింగమనేని గారు దిట్టని చెప్పుకోవాలి. ఈ పుస్తకంలో చేసిన 16 పుస్తక సమీక్షలు, పాఠకులు పుస్తకాన్ని చదవటానికి తగిన భూమికను సిద్ధం చేస్తాయి. ఒక పుస్తకాన్ని చదవటం వల్ల మనం ఏం తెలుసుకోగలమో, ఆలోచించగలమో, ఆచరించగలమో, అనుభూతి చెందగలమో, అర్థం చేసుకోగలమో, స్ఫూర్తిని పొందగలమో, ప్రయోజనం పొందగలమో అవగతమయ్యేలా సమీక్షించటం సింగమనేనిగారి విశిష్టత. పాఠకులు తమతమ అభిరుచులకు తగిన పుస్తకాలను నిస్సందేహంగా ఎంచుకోవటానికి ఉపయుక్తమైన సమీక్షలు సింగమనేనిగారివి. రచయితగా ఆయనెంత గొప్ప సృజనకారుడో, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, సమీక్షకుడిగా అంతటి సమున్నత ప్రజ్ఞాశాలి.
నిజానికి ఆయన జ్ఞాపకాల్లోంచి, ఆయన బాల్యంతో పాటు, చదువులకు దూరమైన పిల్లల గురించి, కరువు సీమగా పేరొందిన రాయలసీమ వెనుక బాటుతనం గురించి, సాగునీరు, తాగునీటికి నోచుకోని ప్రజల, రైతుల దుస్థితి గురించి, ఆర్థిక సంక్షోభాల గురించి తెలుసుకోగలుగుతాం. సానుభూతితో ఆర్ధత చెందుతాం. ఈ వ్యాసం సింగమనేని గారి బాల్యపు జ్ఞాపకాల దొంతరే కాదు. సుమారు 70 ఏళ్ళనాటి రాయలసీమ ప్రాంతపు గ్రామీణ జన జీవన సామాజిక చిత్రణ.
- వల్లూరు శివప్రసాద్