Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
జార్జి ఒన్సీ (George Onsy) ఈజిప్టు వాసి. కవి, కళాకా గాయకుడు, వేదాంతి, మృదుస్వభావుడు. అక్టోబరు 2017లో ప్రపం పండుగ- రామోజీ ఫిలిం సిటీలో వైభవోపేతంగా జరిగినపుడు ఈ కు పరిచయభాగ్యం కలిగింది నాకు. అనేక అవార్డులు, రివార్డులు పొంది, అలుపెరుగ కుండా అనేక దేశాలు తిరుగుతూ ప్రపంచ శాంతికై ప్రచారం చేస్తున్న కవిగాయకుడు జార్జి ఒన్సీ
ఇతడి కవిత్వంలో వేదాంతం, దైవభక్తి, ఏకేశ్వరోపాసన, హిందూదేశంపైఇతడికున్న అభిమానం, ఇవన్నీ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అలతి అలతి పదాలలో అద్భుతమైన వేదాంతాన్ని ఇమిడ్చి వ్రాయడం ఇతని ప్రత్యేకత. 'Awakening | అనే Facebook Page ద్వారా ఎందరికో అభిమానపాత్రుడైనాడు. కలం, కుంచే రెండిటిలోనూ సమానమైన ప్రావీణ్యం ఉన్న జార్జి ఒన్సీ కవితలు సంగీతభరితంగా రసవితమై చదువరులను ఆకట్టుకుంటాయి.
విదేశీ కవుల రచనలను తెలుగులోకి అనువదించి తెలుగు లోకానికి అందజేస్తున్న ప్రక్రియలో భాగంగా జార్జి ఒన్సీ (ఈజిప్టు)రచనను సృజనలోకం సవినయంగా సమర్పిస్తున్నది.
-డాక్టర్ లంకా శివరావు