Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹125

             పూర్వము పాటలీపుత్రాన్ని పరిపాలించిన రాజుకు ముగ్గురు కుమారులు. రాకుమారులను అతి గారాబము చేయడం వలన వారు ఆటపాటలతోనే కాలం గడుపుతూ చదువు సంధ్యలు లేక అల్లరివారిగా తయారయ్యారు. అది చూసి కలత చెందిన రాజుగారు కుమారులను క్రమశిక్షణలో పెట్టడానికి మార్గం సూచించమని మంత్రిని అడిగారు.

              అందుకు మంత్రి, రాజకుమారులకు తక్షణమే విద్యాభ్యాసం చేయించడం ఎంతైనా ఆవశ్యకం అని చెప్పడంతో రాజు గారు అందుకు అంగీకరించి కుమారులకు విద్యాబుద్ధులు నేర్పించడానికి మంచి పండితుల కోసం ప్రయత్నించగా, విష్ణుశర్మ అనే మహా పండితుడు తటస్థపడటం జరిగింది.

               రాజుగారు విష్ణుశర్మని తన వద్దకు పిలిపించి “మా కుమారులకు మంచి విద్యాబుద్దులతో పాటు వినయవిధేయతలు, సభ్యత, సంస్కారం, మరల చేర్పి ఉత్తమ రాకుమారులుగా తీర్చి దిద్దండి" అని కోరారు.

               అందుకు విష్ణుశర్మ "మహారాజా మీరు విచారం మాని మీ కుమారులను నాకు అప్పగించండి. వారికి సకల శాస్త్రాలు నేర్పి, మంచి రాజనీతిజ్ఞలుగా, గొప్పవారిగా తీర్చిదిద్ది మీకు అప్పగించగలను”

                    రాజ గారు సంతోషించి తన కుమారులను విష్ణుశర్మకు అప్పగించి వారి పోషణకై అన్ని ఏర్పాట్లు చేసి పంపించారు. తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు