Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹200

                ప్రముఖ రచయిత, రాజకీయ వ్యాఖ్యాత, జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిణామాలపై సాధికారికంగా ప్రసంగించే వక్త, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాలకు నాయకత్వం వహించి, విద్యార్థి దశలోనే సుదీర్ఘ జైలు జీవితం గడిపిన సమరశీలి, రాజకీయ జిజ్ఞాసువులకు, యువ రచయితలకు ఓనమాలు దిద్దించిన ఆచార్యుడు.

               భారతీయ లోక్ దళ్, జనతాపార్టీలలో రాష్ట్రస్థాయి నాయకుడు, తెలుగుదేశం సంస్థాపక సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా విశిష్ట రాజకీయ విజ్ఞత ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశీలి. "Crop Holiday" అనే పదబంధాన్ని సృష్టించి 9 జిల్లాల పొగాకు రైతాంగాన్ని నాగలి సమ్మెతో, బ్యారన్ మూతతో శాంతియుత పోరాటం నడిపిన ఉద్యమ రథసారథి. రైతు రుణమాఫీ పథకాల రూపశిల్పి, 'పులిచింతల' పథక సాధకుడు, మన దేశంలోని వివిధ ప్రాంతాలలోనే గాక, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, చైనా, థాయ్ లాండ్, నేపాల్, బ్రెజిల్, జింబాబ్వే వంటి పెక్కు దేశాలలో పర్యటించి, అక్కడి స్థితిగతులను సామాజిక రీతిని అవగాహన చేసుకున్న అనుభవశీలి. రాజ్యసభ సభ్యత్వం ముగిసినాక 'లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్'లో వేసవి కోర్సులో చేరి - తన జ్ఞాన తృష్ణను తీర్చుకొన్న నిత్య అభ్యాసకుడు, ప్రముఖ రాజ్యాంగ కోవిదుడు నానీ పాల్జీవాలా నుండి "జాన్ దాల్వీ " జాతీయ అవార్డును అందుకొన్న సామాజిక సేవకుడు.