Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

చిన్న కథలు..

పిల్లల కథలే కాదు.. "ప్రజా క(ళ)థలు -డీ పొట్లం మొత్తని పకోడినా... గట్టి పకోడినా.. ఉల్లిపాయ పకోడినా.. మసాలా పకోడినా.. ఆలూ పడినా.. ఇలా ఏమీ వెతకక్కర్లేదు. అన్ని రకాల రుచులు కుతిగా కలిపి ఉన్న "పకోడిపొట్లం" ఇది. ఎక్కువ పకోడి ఉందేమో తినలేమని భయపడవలసిన అవసరం లేదు. ఇందులో వున్నవి తక్కువ మోతాదులో (తక్కువ నిడివిలో ఉన్న పకోడినే.. గబాగబా తినేయవచ్చు. తిన్నవన్ని వెంటనే అరగించవచ్చు, ఆనందించవచ్చు

గతంలో ఆర్.సి కృష్ణస్వామిరాజు గారు ముగ్గురాళ్ల మిట్ట', రాజుగారి కథలు', సల్లోసల్ల పేర్లతో మూడు కథా సంపుటాలు తెచ్చారు. వివిధ పత్రికలలో శీర్షికలు కూడా నిర్వహిస్తూ, పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. ఇంతకు ముందు వెలువరిచినవి పెద్ద కథలు.

ఈ పకోడి పొట్లం'లోని చిన్న కథలు... 1982 నుండి వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు... ఆలస్యంగా వెలువడుతున్న కథలు. అందుకే పాత వాసనతో పాటు కొత్త సొబగులు ఇందులో చూస్తాం. గమ్మత్తేమిటంటే.. రాజుల కాలం నాటి కథలు ఇందులో వున్నా, ఆ కథలలో వస్తువు ఇతి వృత్తము ఈ నాటి సామాజిక కాలం నేటివిటిని పోలి మనకు కనిపిస్తాయి. మంత్రి లౌక్యం', 'నెమలీక', 'నక్షత్రాల లెక్క', ప్రయత్నం', గడ్డపార', 'ఆస్తి-అప్పు' కథలు ఇందుకు ఉదాహరణలు... ఇవి చూడటానికి పిల్లల కథల్లా కనిపిస్తాయి గాని నేటి రాజకీయ పాలనా విధానానికి కూడా వర్తిస్తాయని ఈ కథలు చదివిన పాఠకులకు అనిపించక మానదు.

నిజానికి కృష్ణస్వామిరాజు గారు ఇటీవల రాస్తున్న రచయిత అని అనుకుంటారు. ఎందుకంటే ఇటీవలే ఆయన కొద్ది కాలంలోనే వరుసగా 3 కథా సంపుటాలు తేవడం వల్ల... పత్రికల్లో తరచుగా కనిపించడం వల్ల కూడా. కానీ ఈ పడి పొట్లం' కథలు చదివిన తరువాత ఇవి 1982 నుండి రాసినవని తెలిసి నేనే చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే నేను సాహిత్యరంగంలోకి అడుగు పెట్టింది,

రాయడం మొదలు పెట్టింది అప్పుడే.. అన్ని పత్రికలూ చదివే నేనే రచయితగా కృష్ణస్వామిగారిని గుర్తించడానికి ఇంతకాలం పట్టింది. అంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది. 'పకోడి...........