Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
“పర్ఫెక్ట్... అంతా సెట్ అయినట్టే” అనుకుంది విమల, షూటింగ్ ఏర్పాట్లని చూసి. గత మూడు గంటల కాలంగా అదే పనిలో మునిగి పోయున్నారు వాళ్ళు. 'టానికి చాలా దూరంలో ఉన్న యూనివర్సిటీలో చేసే ప్రోగ్రాం షూట్ కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రతీ విషయాన్ని గమనించుకుంటూ ఉండాలి. ఏ విజువల్ మిస్ అయినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. బోల్డంత టైం పడుతుంది. మధ్యాహ్నం ఎండ చురుక్కుమనిపించేసరికి కాస్త విశ్రాంతి కావాలనిపించింది విమలకి. అలా చెట్ల కింద చిన్న వాక్ చేయాలనిపించింది. వెళ్లే ముందు అసిస్టెంట్ మురళిని పిలిచి “అంతా ఓకే నా మురళీ..? మొత్తం ప్రోమో షాట్స్ తీసేసుకో..” అన్నది విమల.
“వన్ అవర్ లో క్లోజ్ చేస్తా. కొన్ని ప్రోగ్రాంలో మాంటేజ్ కోసం అనుకున్నా.."
చెప్పాడు.
సరే అన్నట్టు తల ఊపి, కెమెరా ఫ్రేమ్లోకి రాకుండా పక్క నుంచి నడుస్తూ బయటికి వచ్చేసింది విమల. కాలి బాట మీద ముందుకు నడవటం మొదలు పెట్టింది.
ఎస్.ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్.. వందలాది అపురూపమైన వృక్షాలు.. ప్రతీదీ పద్ధతిగా కాలిబాటకు అడ్డం రాకుండా ఎత్తుగా ఉన్న భవనాల మీదకు వాలకుండా ఎంతో శ్రద్ధగా కత్తిరించి ట్రిమ్ చేసిన మోడరన్ అరణ్యం . పర్ఫెక్ట్ గా ఏది ఎక్కడ ఉండాలో డిజైన్ చేసిన నిర్మాణం...
"ఈ మనుషులు దేన్నీ స్వేచ్చగా ఎదగనివ్వరు కదా.. అది మొక్క గానీ,..............