Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పాగి రాజస్థానీ మూలం 1977 లో ప్రచురితమైంది. ఆధునిక రాజస్థానీ కవిత్వాన్ని ఓ మలుపు తిప్పిన గ్రంథమిది. సమాజంలోని అవకతవకల గురించి కవి ఆవేదన ఈ సంపుటిలో ప్రతిఫలిస్తుంది. ఇందలి ప్రతికవితలో కొత్త విలువల కోసం కవిపడే తపన కనిపిస్తుంది.
చంద్రప్రకాశ్ దేవల్ (౧౯౪౯) ఉన్నతశ్రేణి రాజస్థానీ కవిగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, సామజిక కార్యకర్తగా ప్రసిద్దికెక్కారు. రాజస్థానీలో 9 హిందీలో 4 కవితా సంపుటాలను వెలువరించారు. 16 అనువాద గ్రంథాలను ప్రచురించారు. పలు గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందారు. శ్రీ దేవల్ రసాయనిక శాస్త్రంలో పిహెచ్. డి. చేసి అజ్మీర్ లోని జె. ఎల్. ఎన్. మెడికల్ కాలేజీలో 'కెమిస్ట్ గా పని చేసారు.
- ఎన్. గోపి