Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
స్నేహ మాధుర్యాన్ని చవిచూద్దాం మన పిల్లలు తెలుగులో పట్టుమని పది వాక్యాలు ధారాళంగా చదవడం, రాయడం ఈ రోజుల్లో కనాకష్టమైపోయింది. ప్రభుత్వాలు పనిగట్టుకుని తెలుగుకు సమాధి కడుతున్నాయి. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణంలో కూడా తెలుగులో ఒక మంచి పుస్తకం చదివినప్పుడు మండు వేసవిలో శీతల పవనాలు శరీరాన్ని తాకిన అనుభూతిని పొందుతాం. 'ఊసులాడే ఒక జాబిలటా' నవల అలాంటి అనుభవాన్ని మిగిల్చింది.
ఏ విధంగా చూసినా ఈ నవల విశిష్టమైనదే. ఇందులోని పాత్రలు ఊహాజనితాలు కావు. వాస్తవ వ్యక్తులు. వీరు మనకు తారసపడినప్పుడు, మనతో మాట్లాడినప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. రచయిత, పాఠకురాలు రాసుకొన్న లేఖల పాత్రిపదికగా నవలంతా నడుస్తుంది. ఇలాంటి సాహిత్యం తెలుగులో అరుదు. ఒకనాడు రచయితకు, పాఠకులకు మధ్య సంబంధాలెంత సజీవంగా ఉండేవో ఈ నవల మన కళ్ళకు కడుతుంది. మాటలకందని భావాలను లేఖల్లో గొప్పగా ఎలా వ్యక్తం చేయవచ్చో ఇందులో మనకవగతమవుతుంది.
రచయిత, పాఠకురాలి మధ్య ప్రారంభమైన లేఖాయణం పరిధిని విస్తరించుకొంటూ పోయి, యిరువైపు కుటుంబాలను, స్నేహితులను అందరినీ విశాల కుటుంబంగా మలిచిన తీరు మనకు ముచ్చటేస్తుంది. సాహిత్య చర్చ, మానవ సంబంధాలు, విలువలు, రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, ఉద్యమాలు యిలా పలు విషయాలు లేఖల ద్వారా ప్రస్ఫుటమౌతాయి.
సంక్షిప్త సందేశాలు, ఎమోజీలకు పరిమితమైపోయిన నేటి తరానికి, ఇంతింత లేఖలు రాసుకోవడం వింతగా అనిపించవచ్చు. మానవ సంబంధాలను మలచడంలో లేఖల పాత్ర గురించి పాఠాలు నేర్పిస్తారిందులో. లేఖల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడడం, ఉత్తరం వస్తే ఎగిరి గంతేయడం, ఊసులన్నీ నింపి ప్రత్యుత్తరం పంపడం యిదంతా ఎంత ఉద్వేగభరితమో అనుభవించిన వారికి తెలుస్తుంది.
'ఒక క్రమంలో రచయిత, ఆయన కుటుంబం పాఠకురాలికి అత్యంత ఆత్మీయులుగా మారారు. ఉత్తరాల ఊసులకే పరిమితం కాకుండా వ్యక్తిగతంగా నిషిగంధ...................