2000 సంవత్సరం తర్వాత మెల్లిగా మొదలైన కొత్త భావజాలం దానికి సంభందించిన పాత సంప్రదాయాలు , రూపం మార్చుకోకుండానే సమాజంలోకి వస్తున్నాయి. ఇప్పుడైతే ఒక దూకుడుతో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు రచయిత్రులకు సామాజాన్ని ముందుండి నడిపించటమనే ఆదర్శం కంటే వెనక్కు పరిగెడుతున్న సమాజాన్ని అపటమనేది అత్యవసరమని అర్ధమవుతుంది. ఈ పనిలో విసుగు, విషాదం, వీటిని అధిగమించి, పరిస్థితిని తేలికగా తీసుకోకుండా పట్టుదలగా రాయాలి. రాయటంలో కొత్త మెలకువలు నేర్చుకోవాలి. ఒక్కోసారి ఇది చాలా సున్నితంగా జరగాలి. ఒకోసారి తీవ్ర సంఘర్షణ చేయాలి.