Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
పుస్తకం గురించి
ఈ ఆత్మకథ యోగి ఆదిత్యనాథ్ జీవితంలోని కీలక అంశాలను నాలుగు విభాగాల్లో వివరిస్తుంది. ఈ పుస్తకం యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుత అవతారమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదలై 2017 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన రాజకీయ సమీకరణాలు, యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రిగా నియామకం చేసేందుకు దారితీసిన పరిణామాలు, పంచమ్ తల్ - అంటే ఉత్తరప్రదేశ్ సీఎం కార్యాలయంలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ తొలి రోజులు... ఈ ప్రస్తావనలతో ఈ పుస్తకం మొదటి అధ్యాయం మొదలవుతుంది. ఇక రెండవ అధ్యాయంలో ఐదుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ఆదిత్యనాథ్ గురించి, అతని వివాదాస్పద ప్రసంగాల వెనుక దాగిన అసలు హేతువు గురించి, ఘర్ వాపసీ, హిందూ వాహిని, లవ్ జిహాదీల గురించి, బీజేపీతో యోగి ఆదిత్యనాథ్ కు ఉన్న సంబంధబాంధవ్యాల గురించి రెండవ అధ్యాయంలో చర్చించాను. ఇక మూడో అధ్యాయంలో గోరఖ్ నాథ్ మహంత్ జీవితంలోని విశేషాల మీదుగా నా పాఠకులను ముందుకు తీసుకువెళ్తాను. గోరఖ్ నాథ్ మఠ సంప్రదాయాల గురించి, వారసత్వం గురించి,
యోగిగా ఆదిత్యనాథ్ దినచర్య గురించి, వారి గురువుల గురించి, దశాబ్దాలుగా మఠం నిర్వహించే సామాజిక - రాజకీయ కార్యకలాపాల గురించి వివరించాను. ఇక చివరి అధ్యాయంలో ఉత్తరాఖండ్ లోని మారుమూల గ్రామంలో గోవుల మధ్య, పాడి పంటల మధ్య, పర్వతాల మధ్య, నదుల మధ్య కొనసాగిన ఓ యువకుడి ప్రస్థానం గురించి మాట్లాడాను. ఆ యువకుడే తదుపరి కాలంలో సన్యాసిగా, మహంగా, మఠాధిపతిగా, పార్లమెంటేరియన్‌గా, ముఖ్యమంత్రిగా ఎదిగిన క్రమాన్ని వివరించాను............