Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

                       ప్రజల తాగునీటి రంగంలో నిష్టాతుడైన ఆ మేధావి, ముప్పై తొమ్మిదేళ్లపాటు ఆ కృషిలో శ్రమించి కూడా, ఒక విలేఖరి ప్రశ్నతో, తీవ్ర అంతర్మధనానికి గురయ్యాడు. అంతటి నిస్వార్థజీవికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది "ప్రొఫసర్ మకరందరావు" కధలో చుడండి ... పేద దేశాలకు రుణాలిచ్చి ఆదుకునే ప్రపంచస్థాయి బాంక్, ఆ రుణాలివ్వడానికి కారణం "రుణజాలం" లో ... ప్రపంచ రికార్డుల కోసం అంతకంతకు పెరుగుతున్న మోజుపై ఒక సెటైర్ "మకరందరావు" ప్రపంచ రికార్డులు"..... ఉద్యోగాల కల్పనకోసం పరిశ్రమల సేజెలంటూ ప్రభుత్వాలు విచ్చలవిడిగా ఏర్పరచే సేజెల్ భవిష్యత్తుపై ఓ ఫోకస్ "అవసరం" లో... నిరుపేదల ఆకలి, బలవంతుల దోపిడీకి అడ్డురాకుండా చేసే ఒక అస్త్రం "రేమండ్ ఖైదీ"... గిరిజనుల బతుకుల్ని బాగుచెయ్యబోయి, విగతజీవిగా మరీనా ఓ త్యాగమూర్తి "నివాళి"

                          అలాగే లెనిన్ తల్లి మరియు అలెక్షాన్డ్రోహ్న , తన భర్త ఉద్యోగిగా ఉండి అంకితభావంతో కృషి చేస్తూ మరణించగా, పెద్దకొడుకు అలెక్సందర్ నరోడ్నీకి విప్లవంలో ఉరిశిక్ష పాలయ్యాడు. రెండోకొడుకు వ్లదిమీర్ శ్రామిక వర్గ విప్లవంతో ప్రవాసం వెళ్లాల్సిరాగా మిగిలిన ముగ్గురు పిల్లలు అదే విప్లవంతో జైళ్లపాయ్యారు. తన అంత్యకాలంలో ఆమె, ఆ పిల్లల తల్లిగా సాగించిన తలపోతే "ఒక విప్లవ మాత ఆత్మకథ"