Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భారతీయ సంస్కృతి - అపోహలు, వాస్తవాలు
కె.వి.ఆర్. గారి కుటుంబం మాకెంతో ఆత్మీయమైంది. ముందు నాకు గురువు, తర్వాత సహాధ్యాపకుడు, నన్నెరిగి నన్నభిమానించిన వ్యక్తి. జీవితంలో నాకు లభించిన గురువులు, ఒక్కో కోణంలో అందరూ నా వ్యక్తిత్వాన్ని మలచినవారే! కావల్లో భుజంగరాయశర్మ, పట్టాభిరామిరెడ్డిగార్లు, గురువు కాకున్నా, అంతకుమించిన డి.ఆర్. గారు. వీరందరిలోనూ కె.వి.ఆర్. నాకు మిత్రుడు, తాత్వికుడు, మార్గదర్శకుడు, అత్యంత ఆప్తుడు! తన మిత్రులకు (Conscience Keeper) మనస్సాక్షి రక్షకుడుగా చెప్పుకునేవారు. ఆయన సహధర్మచారిణి శారదాంబగారు ఓర్పుకు మారు పేరు. ఆతిథ్యానికి పెట్టింది. పేరు. A woman behind every man లాగా, కె.వి.ఆర్.కి వెన్నుదన్ను. కె.వి.ఆర్.కి సంబంధించి అన్నీ తానై చూసుకునేవారు. శారదాంబగారు కె.వి.ఆర్. సతీమణి కావడం, కె.వి.ఆర్. జీవితంలో గొప్ప అదృష్టం. కె.వి.ఆర్. విరాణ్మూర్తి. వేయి బాహువులతో కొన్ని వేల పుటలు (అచ్చులో) రాశారు. చరిత్ర, సాహిత్యం రెండు కళ్ళు ఆయనకు. ఆ రెంటి అవినాభావ సంబంధాన్ని గుర్తించి, ఆ రెంటినీ పరస్పర పోషకాలుగా సంభావించి రచనలు చేసిన శ్రద్ధాళువు, విద్వన్మణి. ఏ రచన చేసినా, దాన్ని తిరగరాసేవారు కాదు. వారి పిల్లలందరికీ - వసుంధర, రవి, శరత్ లకు నేను అన్నను. మా ఆవిడ అక్క
కె.వి.ఆర్. జైలుకెళ్లినపుడు, లలితను సోదరిగా, నన్ను బావగా విజిటర్స్ లిస్టులో రాయడం మర్చిపోలేని అనుభూతి................