Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹500

                                ఒక అస్పృశ్యుని యుద్ధగాథ . ఇది కేవలం ఒక వ్యక్తి చరిత్రే కాదు. భారతదేశంలో అస్పృశ్యతకు గురై  యుద్ధవీరులుగా మరి విజయ పతాకాలు ఎగరేసిన వారి చరిత్రే. జీవితమంటే యుద్ధమే. సామజిక, ఆర్ధిక, సాంస్కృతిక, తాత్విక, రాజకీయ అణచివేతలను అధిగమిస్తూ, ఆత్మగౌరవాన్ని ప్రకటించిన చరిత్రకాగాధ ఇది. ఈ  కథలో సామజిక జీవన చిత్రాలు ఉంటాయి. సాంస్కృతిక, ఉజ్వల ప్రభాసమాన కదన రంగాలు ఉంటాయి. అక్షరాలన్నీ ఆకాశ నక్షత్రాలుగా వెలిగించిన దివ్వెలు ఉంటాయి. అమ్మ నాన్న గురువు పాఠశాల జ్ఞాపకాలు ఇందులో ప్రజ్వలిస్తాయి. అస్పృశ్యత నుండి నిర్లక్షరాస్యత నుండి ఒక  అక్షర నిధి ఎలా రూపొందిందిందో అన్న కథనమూ ఉంది. సంస్కృత బాషా విద్యార్జనలో ఎదురైనా బ్రాహ్మణవాద ఆధిపత్య జటిలత్వము ఉంది. ప్రతి ఆటంకాన్ని   ఎదుర్కొని నిరాటంకమైన బాటలు నిర్మించుకున్న సమర్ధత ఉంది.