శతాబ్దాల తరబడి రాయలసీమ జిల్లాలు కరువు, కాటకాలకు నిలయం కావడము, సరైన నీరు, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధులు, యజమాన్యత లోపించండంతో బహుముఖ సమస్యలకు, సామూహిక హింసలు, ఆత్మహత్యలు, ప్రకృతి ధ్వoసమునకు, రాగ ద్వేషాలకు గురి కావడమైనది. భాష అనేది ఐక్యత, సమగ్రతను తెస్తుందనేది ఓ మిధ్య. ఒకే భాష వున్నా, అంతర్గత అదృశ్యశక్తులు తమ ఆధిపత్యాన్ని పెంచుతూ, తోటి ప్రాంతాన్ని వలస ప్రాంతముగా మార్చుకోవడం జరిగింది. ఈ పరిస్థితులలో, తన ప్రాంతాన్ని స్వతంత్రస్థాయికి, స్వేచ్చాయుతకు తీసుకొని పోవడం అవసరం, అనివార్యం. అప్పుడే అన్ని రుగ్మతలకు పరిష్కారం వస్తుంది. ఆ ప్రజ నిరంతరాభివృద్ధిని పొంది, దేశం ప్రగతి మార్గంలో పయనిస్తోంది.
-ప్రొఫెసర్ ఎ.రంగారెడ్డి.