తెలుగులో ఆత్మకథలు కొద్దిగా వున్నా వాటిలో వైవిధ్యమైన జీవితానుభవాల చిత్రకరణ లేక, పాఠకులను ప్రభావితం చేసినవి కొన్ని మాత్రమే.
శ్రీ అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి , ఆంధ్రాప్రాయిడ్ గా, చింతనాపరుడిగా ప్రఖ్యాతి గాంచిన రచయిత, దార్శనికుడు . ఈ ఆత్మకథకు అయన పెట్టిన ఉపశీర్షిక "అలాతచక్ర". దాని అర్ధం ఒకడు చీకటిలో నిలబడి వెలుగుదివ్వెను గుండ్రంగా తిప్పినప్పుడు ఏర్పడే కాంతిరేఖావలయం.
శ్రీ అన్నపరెడ్డి తన జీవితంలో చేసింది అదే.