“ప్రతి విప్లవం యొక్క ప్రధాన సమస్య రాజ్యాధికార సమస్వే"
"ఏ వర్గాల చేతిలో అధికారం కేంద్రీకరించబడి వుంది; ఏ వర్గాన్ని లేక ఏ వర్గాలను అధికారాన్నుండి కూలద్రోయాలి? ఏ వర్గం లేక ఏ వర్గాలు అధికారాన్ని చేబట్టాలి? ప్రతి విప్లవం యొక్క ప్రధానసమస్య యిదే”
-లెనిన్
"మన శతృవులెవ్వరు? మన మితృలెవ్వరు? విప్లవానికి సంబందించిన మొదటి ప్రాముఖ్యతగల ప్రశ్నయిది. చైనాలో గత విప్లవాలన్నీ చాలా తక్కువ ఫలితాలు సాధించాయి. అందుకుగల ప్రాథమిక కారణమేమిటి? నిజమైన శతృవుల పై దాడిచేయడానికి నిజమైన మిత్సలతో ఐక్యత లేకపోవడమే అందుకుగల ప్రాథమిక కారణం. విప్లవ పార్టీ ప్రజలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. విప్లవ పార్టీ ప్రజలను ప్రక్కదారులు పట్టిస్తే, విప్లవమెన్నడు జయప్రదం కాదు. విప్లవంలో మనం తప్పకుండా విజయాన్ని సాధించాలంటే, ప్రజలను ప్రక్కదార్లు పట్టించకుండా వుండాలంటే నిజమైన శతృవులపై దాడిచేయడానికి నిజమైన మితృలతో ఐక్యత సాధించే సమస్యను గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.”
"ఒక నిజమైన విప్లవకారుడు తన భావాలు, సిద్ధాంతాలు, పథకాలు, కార్యక్రమాలు తప్పయిపోయినపుడు వాటిని సరిదిద్దుకొనడానికి సంసిద్ధులవటమేగాక, ఒకానొక భౌతిక వాస్తవిక క్రమం అప్పటికే ముందుకు పోయి ఒక అభివృద్ధిక్రమం నుండి మరొక అభివృద్ధి క్రమానికి మార్పు చెందినపుడు అందుకు అనుగుణ్యంగా తన భావాలను ముందుకు తీసుకపోవడానికి మార్పు చేసుకోవటానికి తన్ను తాను సిద్ధపరచుకుంటూ, తనతోటి విప్లవకారులను సిద్ధపరచటానికి గూడా సంసిద్ధంగా వుండాలి. అంటే పరిస్థితుల్లో వచ్చిన నూతన మార్పులకు అనుగుణ్యంగా విప్లవకార్యకర్తల ముందు ఆచరణకు సంభంధించిన నూతన కార్యక్రమాలను అతడు ప్రతిపాదించాలి. విప్లవకాలంలో పరిస్థితులు చాలా వేగంగా మారుతుంటాయి. మారిన పరిస్థితులకనుగుణ్యంగా విప్లవకారుల విజ్ఞానం మార్పు చెందకపోతే వారు విప్లవాన్ని విజయవంతంగా నడుపజాలరు.” ,