Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹300

                  1965 వసంవత్సరం. నేను ఢిల్లీలో Civils కూచిపూడి నృత్యం అప్పుడప్పుడే ఒక శాసీలోకళాకారిణి యామినీ కృపన ఉత్సాహంతో చూడడానికి సగం నేను ఢిల్లీలో Civil Services పరీక్షలకు చదువుకుంటున్న రోజులు.అప్పుడప్పుడే ఒక శాస్త్రీయ నృత్యంగా ప్రాముఖ్యం పొందుతూంది. ప్రసిద్ధ దినపత్రిక Statesman ద్వారా రెండు రోజుల తర్వాత AIFACS Hallలో కూచిపూడి నీ కుషమూర్తి నృత్య ప్రదర్శన జరుగుతుందని తెలిసి నేను, నా మిత్రుడు లక్కీడి చూడడానికి వెళ్ళాం. హాలంతా నృత్యాభిమానులతో నిండి ఉంది. వారిలో సగానికి విదేశీయులే. విరామ సమయం దాకా ఆమె ప్రదర్శించిన కృష్ణశబ్దం, అష్టపది, సంలాంటి solo dances చూసి పరవశించిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో హాలుయింది. విరామానంతరం యామిని ఉషాపరిణయంలోని స్వప్నోత్తర ఘట్టాన్ని చింది. తెర తొలగగానే ఉష “అంత కలలోన నొకసుందరాంగు గాంచి......”అనే

                 మేన గానానికి చిరునగవుతో స్వప్నావస్థ నుంచి మేల్కొంటుంది. ఆనాటి మధుర గాయని మామిని చెల్లెలు జ్యోతిష్మతి. ఇంగ్లీషు వ్యాఖ్యానం అందించింది వారి తండ్రి కృష్ణమూర్తి. కలలో తను చూసిన సుందరాంగుడెవరో ఉషకు తెలియదు. చిత్రలేఖనం తెలిసిన చెలి చిత్రలేఖకు ఉప కలలో తాను చూసిన సుందరాకారుని రూపారేఖావిలాసాలను వర్ణించి చెబుతుంది. ఆమె వరనననుసరించి చిత్రలేఖ గీసిన చిత్రాలను చూసి 'ఇతడు కాదు', 'ఇతడు కూడా కాదు' 'ఇతడు కానే కాదు' అని తోసిపుచ్చుతూ పోతుంది. చివరగా చూసిన చిత్తరువులోని రాకుమారుడే అతడని చెబుతుంది. తర్వాత అతడు కృష్ణుని మనుమడైన అనిరుద్ధుడని, వైరి వంశంవాడని తెలుసుకుంటుంది. అయినా అతన్ని తప్ప ఇంకెవరినీ పరిణయమాడనంటుంది.

                  కృష్ణమూర్తి చేసిన కథాకథనం, వివరణ, వ్యాఖ్యానం, జ్యోతిష్మతి మధురగానం, యామిని అద్భుత నృత్య కౌశలం అక్కడ ఒక రసమయ జగత్తునే సృష్టించాయి. ప్రదర్శన ముగిసింది. లేచి నిలబడిన

                  ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో రెండు మూడు నిముషాలదాకా హాలు మారుమ్రోగింది. సమ్మోహనావస్థకు చేరిన ప్రేక్షకులు నిష్క్రమించడం లేదు. ఇంకా కావాలన్నట్లు నిలిచే ఉన్నారు. కృష్ణమూర్తి వచ్చి “Yamini is too tired to dance anymore” అని సవినయంగా చెప్పి మంగళం పాడించి ఆనాటి కార్యక్రమం ముగించారు. యాభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆనాటి నృత్యానుభవం ఒక మధురస్మృతిగా ఇప్పటికీ నాలో నిలిచివుంది. ఆ తర్వాత 1968లో కాకినాడలో నేను IPS traineeగా ఉన్నప్పుడు ఒక పున్నమి రాత్రి వేదాంతం సత్యనారాయణ బృందం అన్నవరం ఆలయ ప్రాంగణంలో ప్రదర్శనలిస్తున్నారని తెలిసి వెళ్ళాను. చక్కగా అలంకరించిన మంటపం ముందు పిండారబోసినట్లున్న వెన్నెలలో కూర్చొని సాత్వికాభినయభరితమైన ఆయన నృత్యం చూసాను. ఆ కళాతపస్వి పూర్వార్ధంలో ఉషగాను, ఉత్తరార్ధంలో సత్యభామగాను ఆడీ పాడిన తీరు ఇప్పటికీ నాకు కన్నుల కట్టినట్లుంది. ఆలయ

                  ప్రాంగణంలో పున్నమి వెన్నెలలో ఆయన నృత్యం చూడడం ఒక మధురానుభూతి. కలాప సంప్రదాయంలో సత్యభామను సజీవంగా ఉంచి ఆమెకు విస్తృత ప్రాచుర్యం కలిగించిన రకారుడు నారాయణ'