Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                                            తన పుస్తకానికి "ముందుమాట" రాయమని ఒక సీనియర్ సాహితీపరుడిని కొరడంలో గ్రంథకర్తకు సాధారణంగా రెండు ఉద్దేశాలు ఉంటాయి. ఒకటి తన కన్నా పెద్దవాడు, ఎక్కువ తెలిసినవాడు అయినటువంటి ఆ సాహిత్యకారుడు పుస్తకాన్ని ఒక మోస్తరుగా విశ్లేషించి సరిగ్గా అంచనా వేస్తాడు అని. రెండోది అయన తను అభిమానించే పెద్దమనిషి కాబట్టి పుస్తకం గురించి ఎక్కువగా పాజిటివ్ గా వ్యాఖ్యలు చేస్తాడు అని.

                                             Forward/preface/ Introduction - వీటి నడుమ కొద్దిగా వ్యత్యాసాలున్న లక్ష్యం మాత్రం ఒకటే. రచనకు క్లుప్తంగా విశ్లేషిస్తూ, గ్రంథకర్త స్థాయిని అంచనా కడుతూ, పుస్తకాన్ని గురించి ఒక ప్రాధమిక అవగాహనా పాఠకునికి అందించడం. Foreword లేదా Introduction కాస్తా లోతుగా చేసే పరామర్శ కించిత్ విశ్లేషణ, కొద్దిగా విమర్శ, ఒక మోస్తరు సమీక్షలతో కూడుకున్న క్లుప్త పరిచయం అన్నమాట. తన అభిమానిని నిరుత్సాహ పరచకూడదనుకునే కొందరు సాహితీవేత్తల విపరీత వైఖరి వాల్ల గ్రంథకర్త - సాహితీవేత్తల నడుమవుండే వ్యక్తిగత సంబంధాలు, పరస్పర ప్రయోజనాలు లేదా Mutual back scratching వంటి ధోరణులవల్ల ఇటీవలికాలంలో ముందుమాట/ ప్రవేశిక judicious గా ఉండాలన్న ప్రాధమిక నియమం విమర్శణకు గురవుతున్నది.

                                                                                         -కొట్టం రామకృష్ణారెడ్డి.