Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మతములతో, వర్గములతో సంబంధములేని సనాతన మానవధర్మమును బోధించి, దర్శింపజేసి, ఆచరణ శీలతను మానవజాతికి నేర్పిన పరమగురువులలో కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య (మాస్టర్ ఇ.కె) ఒకరు.
జగదాచార్యుడైన శ్రీకృష్ణుని అడుగుజాడలలో ప్రయాణము చేయుచు, వారి జగద్వ్యూహమును ఆచరణ ప్రదము చేసిరి. ధర్మసంస్థాపనార్థమై అహోరాత్రములు పనిచేయుచున్న పరమగురువులు మాస్టర్ మోరియా,మాస్టర్ కు హమి, మాస్టర్ సెరాఫిస్, మాస్టర్ హిలేరియన్ మొదలైన వారిలోమాస్టర్ ఇ.కె. ఒకరు.
వేద సంప్రదాయమును, ప్రాచీన విజ్ఞానమును, భాగవత మార్గమును ఆచరణీయముగా చూపి జనసామాన్యమునకు వానియందాసక్తి కల్గించారు. యువకులలో ఆధ్యాత్మిక సాధనయందు, సేవాధర్మమునందు శిక్షణనిచ్చి వారిని జాతికి పనికివచ్చునట్లు ప్రయోజకులను చేశారు. కొన్ని శతాబ్దములకు సరిపోవు విజ్ఞానమును సమన్వయించి శతాధికముగ గ్రంథములలో పొందుపరచి ఇచ్చారు.