వేదాల విశిష్టతను భారతీయులేకాక , లోకులందరు గుర్తించారు. ఉపనిషత్తులను ప్రపంచ వ్యాప్తంగా జిజ్ఞాసువులందరూ తలకెత్తుకుంటారు . కానీ వాటి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు కాలక్షేపం చేయగలం? వేదాలను, ఉపనిషత్తులను మాత్రం అధ్యయనం చేస్తూ కూర్చున్నట్లయితే వెనకటరామన్ అనే బాలుడి నుండి ఒక అరుణాచల రామణుడు పుట్టు కొచ్చేవాడా? గదాధర్ అనే బాలుడి నుండి రామకృష్ణ పరమహంస జన్మించేవాడా? రామణుడు, రామకృష్ణ లాంటివారు వేదాలలోనూ ఉపనిషత్తులలోనూ లేని దానిని కొత్తగా ఏమి చెప్పారని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి చెప్పలేదని అంగీకరించాలి. ఆ ,మాటకు వస్తే వేదాలు ఉపనిషత్తులను దాటి "పవిత్రమైనదాని " ని గురించి ఎవరూ ఏమి చెప్పలేకపోవచ్చు. అలాంటప్పుడు వాటిని వల్లెవేసుకుంటూ కుర్చుంటేచాలు అనుకునే వాళ్ళున్నారు. కానీ ఎంతైనా దానిని గురించి వల్లే వేయడం ద్వారా మహాపురుషులు జన్మించరు.