Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹110

                    కథ , కవిత్వం నాకు ఇష్టమైన పనులు. విమర్శ కష్టమైనపని. మరి ఆ పనిలోకి నేనెందుకు దిగాను? "సాహిత్యం - మౌలిక భవనాలు" విమర్శా సిద్ధాంత వ్యాసరచనలో కింద మీదా పడే సమయంలో ఈ పని పడింది. అది కథ కవితో రాసినంత తేలికైన పని కాదని అనుభవపూర్వకంగా అర్ధమైంది. అందుకనే నూటికి తొంబై మంది రచయితలు విమర్శ జోలికి పోరు. కేవలం ఒక అనుభూతి/భావ వ్యక్తీకరణ చాలు కవిత్వానికి. అందువల్లనే కథకులు, విమర్శకుల కంటే కవులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నారు.

                       కథ లేదా కవిత్వం ప్రాధమికంగా ఒక అన్వేషణ అయితే విమర్శ ఆ అన్వేషణ యొక్క అన్వేషణ. ఒక రచన కనుగొన్న దాని మంచి చెడ్డలు విశ్లేషించి, సారాంశం తెల్పటమే విమర్శ చేసే పని. ఇందుకుగాను ఆ విమర్శకుడికి సిద్ధాంత పరిజ్ఞానం, విస్తృత సాహిత్య అన్నిటిని మించి విమర్శకుడు సహృదయుడై ఉండాలి.