Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹120

                         రమణుని ఉపదేశమార్గం ఎలా వుండేది? అరుణాచల గుహల్లో నివసించే కాలంలో, ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు. మాట్లాడవలసిన అవసరం కలగలేదు. అప్పుడు అతని అనంత శక్తివంతమైన మౌనంలో, అన్వేషకులకు సంశయ నివారణ అయ్యేది. చివరి రోజుల్లో ఆయన మౌనం చాలా శక్తివంతంగా వుండేది. అన్వేషకుని మనసుకు తగిన సమాధానం కలిగించేది. ఆయన అప్పుడప్పుడు ముఖ్యమైనట్టి ప్రశ్నలకు సూటైన జవాబులు ఇచ్చేవారు; సాధకునివంక అనుగ్రహంతో చూస్తూ. ఆయన మహాసమాధి అయిన తర్వాత కూడా జవాబుల శక్తి తగ్గలేదు.

                          ప్రతి అధ్యాయం ముందు ముఖ్యమైన విషయాలను, మనసులో వుంచుకోవడానికి వీలుగా క్లుప్తంగా అవసరమైన సమాచారం ఇవ్వబడింది. సాధకుని అత్యంత అవసరంపై దృష్టి వుంచి ప్రతి అధ్యాయంలో కావలసిన విషయాలు ఒక క్రమంలో ఏర్పాటు చేశాను. ఎందుకంటే, సాధకులకు అభ్యాసకాలంలో మార్గదర్శకత్వాన్ని ఇవ్వడమే ఈ గ్రంథం యొక్క ప్రధానోద్దేశ్యం. ఆత్మవిచారణ వలన కలిగే ప్రయోజనం ఏమిటని అడగవచ్చు. సాధన చేయకపోతే నేను కోల్పో యేది ఏది? తీవ్రంగా, శ్రద్ధగా అన్వేషిస్తే కలిగే లాభం ఏమిటి? దీనికి జవాబు మన దైనందిన జీవితంలోకి ఒకసారి దృష్టి మరలిస్తే తెలుస్తుంది. సుఖంగా, ఆనందంగా వుంటున్నామా? లేదా? సుఖదుఃఖాల మిశ్రమం అనుభవిస్తున్నామా? మన మనసు మన స్వాధీనంలో వుందా? ఆలోచనను ఆపి మనం విశ్రమించగలమా? మనసు కోరే కోర్కెల నుండి మనం విముక్తులమా? ప్రతివారూ ఆశించే మనశ్శాంతి ఎక్కడ? మనం విధి చేతిలో కీలుబొమ్మలమా? యజమానులమా? ఈ నిరంతర క్రియా ప్రవాహం నుండి విముక్తులమై చూడ్డానికి, ఆగడానికి, వుండడానికి వీలు అవుతుందా? ప్రతివానికి వారి అంతరాత్మల్లో జవాబు దొరుకుతుంది. కనుక రమణుడు సూచించినట్లే మార్గంలో అన్వేషించేవారికి, ఏమి కలుగుతుందో చూడవచ్చు. ఎందుకంటే అది అనుభవపూరితం, సాధన ఫలితం, ఆ మార్గంలో ముందుకు పయనించే కొద్దీ దాని సౌందర్యాన్ని గుర్తించగలం. మార్గం, లక్ష్యం, స్పష్టంగా వుంది. తన యొక్క సత్యాత్మను కనుక్కోవడమే లక్ష్యం. సహజావస్థలో నిలచివుండుటే, లక్ష్యం. దాన్ని చేరుటకు చేసే సాధనలు స్పష్టంగా వున్నాయి. మెల్లిగా మనసులో చిక్కులు విడి కాలంధం తెగిపోతుంది. అప్పుడు మనం శక్తివంతమైన మౌనం,అనంతమైన ఆనందం అపరిమితమైన సుఖం పొందగలం.