Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
ఎక్కదలచిన నావ ఏడాది లేటు
జర్మనీ వాడికీ జపానువాడికీ బుద్ధుండి ఉంటే ఇండియాకు స్వాతంత్ర్యం 1942 లోనే వచ్చేది.
అది రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలం.
అందులో జర్మనీ, జపాన్ లు మిత్రులు. వాటికి ప్రధాన ప్రత్యర్థి బ్రిటన్. ఆ బ్రిటను బలానికి పెద్ద దన్ను-దాని కజ్జాలో ఉన్న భారతదేశం. దాని బారి నుంచి భారత్ బయట పడేట్టు చేయగలిగితే ఇంగ్లండు కొమ్ములు విరుగుతాయి.
అదీ ఎలా అవుతుందా అని జుట్టు పీక్కోవలసిన పనిలేదు. ఆ కార్యం సాధించగల మహావీరుడు తనంతట తానే అక్ష కూటమిని ఆశ్రయించాడు.
ఆ పని అతడివల్ల కాకపోతే ఈలోకంలో ఇంకెవరివల్లా కాదు. ఎందుకంటే అతడు అలాంటి ఇలాంటి బలశాలి కాడు. ఇండియా మొత్తంలో మహాత్మా గాంధీ ప్రజాబలానికి తిరుగులేదు. అంతటి మహాత్ముడినే ధిక్కరించి... ఆయన సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థినే బహిరంగ ఎన్నికలో మన్ను కరిపించి భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడు కాగలిగిన ప్రజా నాయకుడు
నేతాజీ సుభాస్ చంద్ర బోస్ !!
ప్రజాస్వామ్య విహితంగా అధ్యక్షుడయిన వాడిని తన మానాన తనను పనిచేసుకోనివ్వాలన్న వివేకం గాంధీ వర్గానికి కొరవడింది. తమను ఎదిరించి గెలిచాడన్న అక్కసుతో -ఎన్నికైన అధ్యక్షుడిని తిన్నగా పని చేసుకోనివ్వకుండా సహాయనిరాకరణ చేసి గాంధీ వర్గీయులు నానావిధాల సతాయించారు. వారితో వేగలేక, మహాత్ముడి మనసు మార్చలేక, చీటికీ మాటికీ ఆయనతో తలపడటం ఇష్టం లేక సుభాస్ బోసు అధ్యక్ష పదవిని వదిలి వేరే దారి వెతుక్కున్నాడు. గాంధీ గ్రూపు మూర్ఖత్వం, మంకుతనాల మూలంగా దేశంలో ఉండి సాధించలేకపోయిన స్వాతంత్ర్యాన్ని దేశం వెలుపల నుంచయినా సాయుధ పోరాటం ద్వారా..............