Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹150

బయోగ్రఫి

డా॥ ఎస్.ఎస్.గిరిధరప్రసాద్ రాయ్

M.A., M.Ed., M.Phil., Ph.D.

                  సుంకర శ్రీరాములు గిరిధరప్రసాద్ రాయ్ గారు ఆంగ్లోపన్యాసకులుగా Dr BR. LA.C.S.W.R. జూనియర్ కళాశాల కురుగుంట, అనంతపురములో పనిచేసి ఈ మధ్యనే పదవీ విరమణ పొందారు. ఈయన తొలిసారిగా 1988లో రచించిన పద్యకావ్యం “The | Bards Flight” తరువాత 1989లో రచించిన “శ్రీ వీరయ్యనాయకుని చరిత్ర” (తిమ్మమ్మ మర్రిమాను కథ) తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ సాహిత్యంగా గుర్తింపు పొందింది. 1992లో రచించిన "బలిజరాయ తరంగిణి” చరిత్ర గ్రంథం బహుళ ప్రచారం పొంది కన్నడ, తమిళ భాషల్లోకి అనువదింపబడింది. 2012లో "The Story of | Thimmamma Marrimanu”, “Agony of Young Man” విడుదలయ్యా యి. విద్యా రంగంలో తనకున్న అనుభవాన్ని గ్రంథస్తం చేస్తూ రచించిన బయోగ్రఫీ “నేను నా బడి” తో పాటు ఈయన కలం నుండి మరికొన్ని గ్రంథాలు వెలువడనున్నాయి. 2017లో ఈయన ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పంకు సమర్పించిన సిద్ధాంత గ్రంథం "Exploitation and Social Realism in the Novels of Babani Bhattacharya” | పై డాక్టరేట్ పట్టా పొందారు.

                 “రాయల్ లిటరరీ కల్చరల్ డెవలప్ మెంట్ సొసైటీ” ఆధ్వర్యంలో ఎన్నో సాహితీ సమావేశాలు నిర్వహించి కవులను, కళాకారులను సన్మానించారు. ఇలాక్, అనంత పురము శాఖ శాశ్వత సభ్యుడిగా కొనసాగుతున్నారు. చరిత్ర, పర్యావరణం, సామాజిక , నేపథ్యంలో తాను రూపొందించిన కొన్ని వీడియాలను యూట్యూబ్ లో ఉంచడం జరిగింది. . ఈయన సాహిత్య సేవలను కొనియాడుతూ, రాష్ట్ర,

                   జాతీయస్థాయి పత్రికలలో సమీక్షలు ప్రచురించబడ్డాయి. 2000 సం||లో సాహిత్య అకాడమీ వారి “Who's Who” మరియు 2002 సం||లో “Asia Pacific Who's Who" గ్రంథాల్లోను ఇతని సాహిత్య సేవ, బోధన, ఉత్తమ ఉపాధ్యాయుడుగా, ప్రిన్సిపాల్ గా చేసిన సేవలను గుర్తించడం. ఎన్నో సభలు, సమావేశాల్లో ఎందరో ప్రముఖులతో సన్మానించబడడం రాయ్ | గారి విశిష్టతను DIVATERERA