Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.


IN STOCK
  • 100% Quality Book Available
  • Delivered in: 4 - 9 Days
  • Free delivery for order over ₹ 500
Price: ₹250

                         నటుడు సోనుసూద్ పేరు ప్రఖ్యాతుల వలయంలో చిక్కుకుని విలాసవంతమైన భవనంలో కూర్చుని అక్కడి నుంచే అవసరార్డులకు సాయం అందిస్తే.. భారత దేశ వలస కార్మికుల కడగండ్లు ఎప్పటికీ తెలుసుకోలేకపోయేవారు. వారు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు తను పంచే ఆహార పొట్లాలు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావని తెలిసేది కాదు. వీధుల్లో ఉన్న వారిని తీసుకువచ్చేందుకు, చిక్కుకుపోయిన వారి వద్దకు చేరుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం నుంచి జాతీయ, అంతర్జాతీయ రవాణా కోసం ఏర్పాట్లు చేయడం వరకు | సోనుసూద వేలాది మంది నిస్సహాయ ప్రజలకు సహాయం చేయగలిగారు.

                        'ఘర్ బేజో' కార్యక్రమాన్ని ప్రారంభించి.. మానవతావాదిగా ముందుకు తీసుకువెళ్ళారు. వెండితెర ప్రతినాయకుడు నిజ జీవితంలో సూపర్ హీరోగా మారారు.

                         సోనూ సూద్ జీవితంలోని అసాధారణ అనుభవాలతో పాటు, మోగా నుండి ముంబై వరకు ఆయన ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి మీనా కె. అయ్యర్ తన రచనా నైపుణ్యంతో ఈ పుస్తకం ద్వారా మనకు అందించారు. నిజాయితీగా, స్ఫూర్తిదాయకంగా, హృదయాన్ని కదిలించే విధంగా రచించబడిన ఈ పుస్తకం తప్పక చదవదగినది.

                        “మీరెంతో స్ఫూర్తి దాయకం. దేవుని ద్వారా నిర్దేశించబడిన పనిని చేస్తూనే ఉండండి. సోనూ, మీరు చేసే ప్రతి పనికీ ధన్యవాదాలు” - ప్రియాంక చోప్రా, నటి.

                        “అవసరంలో ఉన్నవారికి సాయం చేసే నా సాటి పంజాబీలను చూస్తే నా హృదయం ఉప్పొంగుతుంది. గర్వంగానూ భవిస్తా. ఈసారి మన మోగా కుర్రాడు.. సోనుసూద్ వలస కార్మికులను అక్కున చేర్చుకుంటున్న తీరు నా మనసును ఎంతో ఆకట్టుకుంది. వారిని స్వస్థలాలకు పంపేందుకు సోనూ నిరంతరం శ్రమిస్తున్నాడు” - కెప్టెన్ అమరీందర్ సింగ్, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి