శ్రీ దరిసి చెంచయ్య నెల్లూరు జిల్లా కనిగిరి అనే చిన్న పట్టణంలో 1890 లో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు.
ఉన్నత విద్యకై 1913లో అమెరికా వెళ్ళి ఉన్నత విద్యను కొనసాగిస్తూ, అక్కడ గదర్ పార్టీలో సభ్యుడిగా చేరి బ్రిటిష్ సామ్రాజ్య వాదుల నేదుర్కొడానికి సాయుధ విప్లవమే శరణ్యమని, ఆయుధాలు సేకరించి, అమెరికా నుండి ఓడల్లో భారత దేశానికీ తెస్తూ, పట్టుబడిన గదర్ వీరులలో ఏకైక ఆంధ్రుడు.
గద్దర్ పార్టీ ఉద్యమం 1913 - 1919 వరకు భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రధాన ఘట్టం, సైనికుల తిరుగుబాటు ఒక వ్యూహం - ఎత్తుగడ.
ఆనాటి సంఘిక, ఆర్ధిక, రాజకీయాలతో పటు ఆనాటి అనుభవాలాను కండ్లకు కట్టినట్లు చిత్రించారు శ్రీ దరిశి చెంచయ్యగారు.
ఈ తరం యువకులకు ఇది ఏంతో ఉత్తజాన్ని, దేశభక్తిని ప్రబోధిస్తుంది.
-దరిశి చెంచయ్య.