ఫిబ్రవరి 1970 నించి మల్లాది వెంకట కృష్ణమూర్తి రచనలు చేస్తున్నారు. మొదటి కథ ప్రచురించబడ్డ ఆగస్టు 1970 నించి ఆగష్టు 2020 కి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ పుస్తకాన్ని వెలవరిస్తున్నాం.
మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 160 నవలలకి ఐడియా ఎలా వచ్చింది. వాటిని నవలలుగా రూపొందించిన విధానం, వాటి సినిమా, టి. విల చిత్రీకరణ అనుభవాలు మొదలైనవి ఇందులో విశదపరిచారు. ఇది రచయితలకి కూడా ఎడ్యుకేటివ్ గా ఉంటుంది.
ఇందులో అనుబంధం విభాగంలో 1960 నించి తెలుగు నవల విహంగ వీక్షణం, మల్లాది వెంకట కృష్ణమూర్తి వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూ లు, వివిధ పత్రికలలో నిర్వహించిన శీర్షికల వివరాలు, సినిమాలుగా వచ్చిన నవలలు వివరాలు, ఇతర పుస్తకాల పరిచయం మొదలైనవి చదవచ్చు.
- మల్లాది వెంకట కృష్ణమూర్తి