యోగకు ఇస్లాంతో, హిందుత్వంతో, జైనత్వంతో పనిలేదు.
కానీ జీసస్, మహ్మద్, బుద్ధుడు, మహావీరుడు ఇలా
ఎందరైతే సత్య సాక్షాత్కారం పొందారో వారందరు కూడ
యోగ మార్గం ద్వారా పయనిస్తే కానీ సత్య సాక్షాత్కారం
జరగలేదు. యోగలోని విశాల తలాలు తప్ప జీవితానికి
ఆత్మానందానుభూతిని పొందే మార్గం లేదు. మనం మతాలు
అని పిలుచుకునేవి కేవలం నమ్మకపు వ్యవస్థలే, కానీ యోగ
అలా కాదు. జీవిత సత్యాన్ని వెతికే క్రమబద్ధమైన
వైజ్ఞానిక బోధన పద్ధతుల వైజ్ఞానిక ప్రయోగం యోగ.
అందుకే, యోగ నమ్మక వ్యవస్థ కాదు, అదొక విజ్ఞాన శాస్త్రం
అని మీకు ముందుగా చెప్పాలనుకుంటున్నాను. యోగను
అనుభూతి పొందేందుకు, యోగతో ప్రయోగాలు చేసేందుకు
ఏ రకమైన నమ్మకాలు కానీ, మూఢనమ్మకాలు కానీ అక్కర్లేదు.
యోగ ప్రయోగాలలోనికి ఆస్తికుడు వెళ్ళగలిగినట్లే
నాస్తికుడు కూడ వెళ్ళగలదు.
మీ జ్ఞానాన్ని పెంచి, మిమ్మల్ని గొప్ప జ్ఞానవంతులను చేయాలనే
ఉద్దేశంతో ఈ తొమ్మిది సూత్రాలను చెప్పలేదు....
బహుశా! మీలో ఏదో ఓ చిన్న కదలిక కలిగి ఏదో ఒక ఆధ్యాత్మిక
ప్రయాణంలో ముందుకు సాగుతారనే ఆశతో చెప్పాను.
- ఓషో