నాదములోని వినోదము, నాట్యములోని విలాసము పరమానంద సుఖము మరియు మోక్షము.
నాదము మరియు నాట్యముల మేళవింపు అభినవ అనగా కొత్త వేదము. అది సభికులకు ఆనందము కలుగ చేస్తుంది. మోక్ష మార్గమును నిర్దేశిస్తుంది.
కరణములు, భంగిమలతో కూడిన ఆంగికము, భావము, గమకము, గానము, మరియు అలంకారముల మేళవింపు కన్నుల, మరియు వీనుల విందు కలుగజేయునది నాట్యము.
కూటస్థములో సాధకునికి కనబడే మూడవనేత్రముయొక్క వెలుగు లాంటిది ఈ నాట్యము.
అది కార్తీక మాసములో వెలుగించే మంగళ ప్రదమయిన ప్రమిదలేని మంగళ కాంతులు విరజిమ్మే శీతల దీపములాంటిది.
- కౌతా మార్కండేయ శాస్త్రి