Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
మొరాకోలో నవంబర్ 2017 పొయెట్రీ ఫెస్టివల్ లో నేను కలిసాను అద్భుతమైన కవి మిత్రులు మారియా మిరాగ్లియా (Maria Miraglia), సవేరియె సినొపొలి (Saverio Sinopoli) దంపతుల్ని. మా అభిప్రాయాలు, అభిరుచులు ఒకేరకంగా ఉండడంతో త్వరగా మిత్రులమైనాం. అక్టోబరు 2017 PentasiB World Poetry Festival కు రాలేకపోయినా వాళ్లిద్దరి స్నేహం నాకిక్కడ లభ్యం కావడం నా అదృష్టం.
డాక్టర్ మారియా మిరాగ్లియా కవిత్వం చిగురుటాకుల్లా ఎంతో కోమలంగా, మకరందంలా ఎంతో మాధుర్యంగా, సముద్రమంత లోతైనభావాలతో చదువరులను ఆకట్టుకుని చెరగని ముద్రవేస్తుంది. చిన్ని చిన్ని వాక్యాలలో, పరిచితమైన దృశ్యాలలో సాధారణంగా అందరూ పట్టించుకోని కోణాలలోని లోతుల్ని, గూఢత్వాన్ని తాను దర్శించి మనకు దర్శింపచేస్తుంది మారియా మిరాగ్లియా.
ప్రకృతిలో తానూ భాగమై తాను అనుభవించిన ఉద్వేగాలను ప్రేమ, కన్నీళ్లతో మిళితం చేసి అపురూపమైన భాషా సౌందర్యంతో మనల్ని మరో లోకంలోకి చేయిపట్టుకుని నడిపిస్తుంది మారియా మిరాగ్లియా.
ప్రపంచ సాహిత్యంలో భాగంగా 2018లో సృజనలోకం అందిస్తున్న కవితా సంకలనాల్లో డా|| మారియా మిరాగ్లియా కవిత్వం - విశిష్టమైనది, విలక్షణమైనది. తెలుగు సాహిత్యలోకం ఈ ప్రయత్నాన్ని హర్షిస్తుందని గాఢంగా విశ్వసిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్